ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 30: ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ అటానమస్ కళాశాలలో మొదటి సెమిస్టర్ ఫలితాలను కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ బుధవారం విడుదల చేశారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏలో 2024-25 విద్యాసంవత్సరం విద్యార్థుల ఫలితాలను వెల్లడించినట్లు చెప్పారు.
కరస్పాండెంట్ డాక్టర్ ధాత్రి, సీవోఈ శివప్రసాద్, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్, గంధం శ్రీనివాసరావు, రవీంద్రబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.