మిర్చి తోటలకు పరిశీలించిన శాస్త్రవేత్తలు
జిల్లాలోని రఘునాథపాలెం, ముదిగొండ, చింతకాని, తల్లాడ, వేంసూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో గల మిర్చి తోటలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారులు గురువారం పరిశీలించారు.
ఖమ్మం వ్యవసాయం, జనవరి 11 : జిల్లాలోని రఘునాథపాలెం, ముదిగొండ, చింతకాని, తల్లాడ, వేంసూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో గల మిర్చి తోటలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారులు గురువారం పరిశీలించారు. మిర్చి పంట నాణ్యత కోల్పోవడం, తగ్గిన దిగుబడులకు గల కారణాలను అన్వేశించి సమగ్ర నివేదికను రూపొందించాలని సంబంధిత అధికారులకు రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింట్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శాస్త్రవేత్తలు, అధికారుల బృందం మిర్చి తోటలతోపాటు కల్లాలను సైతం సందర్శించారు.
జిల్లాలో కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల మిర్చి తోటలకు సోకిన తెగుళ్లు, మచ్చలు, తద్వార తగ్గిన దిగుబడులపై పరిశోధనతోపాటు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో మిర్చి సాగు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, పురుగు మందుల పిచికారీ తదితర అంశాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ టీ.సురేశ్, కేవీకే శాస్త్రవేత్తలు రవి, ఏ.శైలజ, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ డీడీ ఎస్.మోహన్‌రెడ్డి, డీఏవో విజయనిర్మల, జిల్లా ఉద్యాన శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ.రమణ, మార్కెటింగ్ శాఖ జేడీ వీ.శ్రీనివాస్, ఏడీఏ సరిత, డీఎంవో అలీం, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

