ఖమ్మం : స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 సంబంధించిన పోస్టర్ను జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమాన్ని స్కూల్ ఇన్నోవేషన్ సెల్, యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను, ఇతర నైపుణ్యాలను వెలికితీయడానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని డీఈఓ పిలుపునిచ్చారు.
గూగుల్ లింక్ ద్వారా ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయుడు పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరక్టర్ ముమ్మడి వెంకటేశ్వరచారి, సెక్టోరల్ కో ఆర్డినేటర్స్ రామకృష్ణ, రాజశేఖర్, జీసీడీఓ చల్లపల్లి ఉదయశ్రీ, సైన్స్ అధికారి సైదులు తదితరులు పాల్గొన్నారు.