చుంచుపల్లి, జూన్ 13: పాఠశాలల పునఃప్రారంభంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని అందిన ఫిర్యాదులతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేట్టారు. నిబంధనలను అతిక్రమించిన బస్సులపై కొరడా ఝులిపించారు. బస్సుల కండీషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు.
జిల్లావ్యాప్తంగా స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాధికారి తోట కిషన్‌రావు చెప్పారు. జిల్లాలో మొత్తం 229 బడి బస్సులు ఉన్నాయి. వాటిలో గురువారం వరకు 136 మాత్రమే ఫిట్నెస్ అయినట్లు తెలిపారు. ఇంకా 93 బస్సులు ఫిట్‌నెస్‌కు రావాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అశ్వాపురంలో బస్సుల యజమానులకు, డ్రైవర్లకు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు. ఫిట్నెస్ లేకుండా బస్సు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.