పెనుబల్లి, ఏప్రిల్ 25: రజతోత్సవ వేళ ఊరూరా గులాబీ పండుగ వాతావరణం నెలకొన్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎడ్లబంజరలో బీఆర్ఎస్ నాయకుడు టీవీ రామారావు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వానికి సరిపోతున్నదని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే దిక్కే లేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడే ప్రసంగం కోసం యావత్ తెలంగాణ, దేశం కూడా ఎదురుచూస్తుందన్నారు. అనంతరం జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల చేతిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకట్రావు, చెక్కిలాల మోహన్‌రావు, చెక్కిలాల లక్ష్మణరావు, కోటగిరి సుధాకర్‌బాబు, మందడపు అశోక్‌కుమార్, నీలాద్రిబాబు, లగడపాటి శ్రీనివాస్, గోదా చెన్నారావు, తెల్లగొర్ల జనార్దన్, తాళ్లూరి శేఖర్‌రావు, కనగాల సురేశ్‌బాబు, ఎలమర్తి శ్రీను పాల్గొన్నారు.
మధిర, ఏప్రిల్ 25: ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా మధిరలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రూట్ మ్యాప్ ఆధారంగా వాహనాలను రెండో జోన్‌లోని పార్కింగ్‌కు తరలించాలన్నారు.
కార్యకర్తలకు ముందస్తుగా సమాచారం ఇచ్చి బస్సుల్లో ఎక్కే విధంగా నాయకులు వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, చావా వేణుబాబు, వంకాయలపాటి నాగేశ్వరరావు, యన్నంశెట్టి అప్పారావు, ఆళ్ల నాగబాబు, సయ్యద్ ఇక్బాల్, కొత్తపల్లి నరసింహారావు, ఉమామహేశ్వరరెడ్డి, కోటిరెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.