మధిర/ ఇల్లెందు, ఏప్రిల్ 4: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులు మధిర, ఇల్లెందు ఆర్టీసీ డిపోల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగులు భిక్షపతి, ఫకీరయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఏళ్లతరబడి పనిచేసి ఉద్యోగ విమరణ పొందినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డు ఉద్యోగులకు నూతన పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని, రిటైర్డు అయిన ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.