రఘునాథపాలెం, జనవరి 18 : డైమండ్, బంగారు, వెండి ఆభరణాల ప్రముఖ దిగ్గజ సంస్థ ‘భీమ జ్యువెల్స్’ ఖమ్మంలో తన నూతన షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం, యుఏఈ వ్యాప్తంగా 70 షోరూమ్‌లు కలిగిన భీమ జ్యువెల్స్ ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలకూ చేరువైంది. శనివారం ఖమ్మం నగరం వైరా రోడ్డులోని బాబూరావు పెట్రోల్ బంక్ ఎదుట భీమ జ్యువెల్స్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రముఖ హీరోయిన్ రీతూ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.
రీతూ వర్మ వస్తున్న విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు పెద్ద ఎత్తున షోరూం వద్దకు చేరుకోగా.. వారిని చూసి అభివాదం చేస్తూ.. బాగున్నారా.. అంటూ పలకరించారు. అనంతరం ఆమె షోరూంలో విక్రయానికి ఉంచిన డైమండ్, బంగారు, వెండి ఆభరణాలను పరిశీలించారు. చైర్మన్ బి.బిందు మాధవ్, మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ బిందు మాధవ్, డైరెక్టర్ సరోజిని బిందు మాధవ్ షోరూంలో అందుబాటులో ఉంచిన వజ్రాలు, బంగారం ఆభరణాల వెరైటీలను గురించి వివరించారు. మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ విజయ నిర్మల, భీమ జ్యువెల్స్ సీవోవో గోపకుమార్ పాల్గొన్నారు.