ఓటే ఆయుధం
భారత ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. అందుకు ఓటు హక్కు నమోదు చేసుకోవడం, ఎన్నికల్లో దానిని వినియోగంచడం.. పౌరుల ప్రధాన కర్తవ్యం. అయితే, ఎంతో విలువైన ఓటును ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నామని, ఈసారి కూడా జాబితాలో తమ పేరు ఉంటుందిలే అని ఉదాసీనంగా ఉండొద్దు.
- భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం
- ప్రతి ఎన్నికలోనూ దాని వినియోగం పౌరుల ప్రధాన కర్తవ్యం
- అందుకు ఓటు హక్కు నమోదు అత్యంత ఆవశ్యం, అనివార్యం
- ఇప్పటికే ఓటు ఉన్నా జాబితాలో పేరుండడమే అంతిమం
- అక్కడ లేకుంటే ఆన్లైన్లో పొందడం ఇంకా సులభం
- అందుకోసం అధికారిక వెబ్‌సైటే ముఖ్యమైన ఆధారం
సత్తుపల్లి, ఏప్రిల్ 11 : భారత ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. అందుకు ఓటు హక్కు నమోదు చేసుకోవడం, ఎన్నికల్లో దానిని వినియోగంచడం.. పౌరుల ప్రధాన కర్తవ్యం. అయితే, ఎంతో విలువైన ఓటును ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నామని, ఈసారి కూడా జాబితాలో తమ పేరు ఉంటుందిలే అని ఉదాసీనంగా ఉండొద్దు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల తాజా ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటుకు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఓటరు జాబితాలో పేరు ఉందో.. లేదో.. తెలుసుకోవాల్సిన బాధ్యత ఓటర్లందరిపైనా ఉంది. జాబితాలో పేరు లేకపోతే తక్షణమే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కొత్తగా ఓటరు నమోదుతో సహా మార్పులు, చేర్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోంది. అదేవిధంగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లోగానీ లేదా బీఎల్వో ద్వారా గానీ లేదా తహసీల్దార్ కార్యాలయం ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ ద్వారా..
ఓటు నమోదు, వివరాల పరిశీలన కోసం ఎన్నికల సంఘ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్తే ‘సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డీటెయిల్స్’, ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’, ‘సెర్చ్ బై మొబైల్ నంబర్’ అనే ఉప విభాగాలు ఉంటాయి. అందులో ‘సెర్చ్ బై మొబైల్ నంబర్’ విభాగంలో ఓటరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని పొందుపరిస్తే ఓటరు వివరాలు కనిపిస్తాయి. మిగతా రెండు విభాగాల్లో ఓటరు పేరు, తండ్రి పేరు, జిల్లా పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వంటివి ఎంట్రీ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మొబైల్ యాప్ పని చేస్తుందిలా..
గూగుల్ ప్లేస్టోర్‌లో ఓటరు హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. యాప్‌లోకి ప్రవేశించాక ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్’ విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై క్యూ ఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే విభాగాలు కనిపిస్తాయి. మొదటి రెండు విభాగాలకు సంబంధించి ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. దీని ద్వారా ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవచ్చు. పేరు, తండ్రి పేరు, వయస్సు, జిల్లా , నియోజకవర్గం తదితర వివరాల ద్వారా యాప్‌లో ఓటరు వివరాలను సరిచూసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా..
https// ceotelang ana.nic.in వెబ్సైట్లోకి వెళ్తే ఎలక్ట్రోరల్ రోల్స్ విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు కనిపిస్తాయి. సంబంధిత నియోజకవర్గం పేరును ఎంచుకుంటే అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ రూపంలో ఉంటుంది. సదరు ఓటరు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తాడో చూసుకుని జాబితాలో తన పేరు ఉందో, లేదో పరిశీలించుకోవచ్చు. అందులోనే ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటరు లిస్ట్’ విభాగం ద్వారా కూడా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య ద్వారా..
http//voterportal.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే ‘సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్’ విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య పొందుపరిస్తే.. జాబితాలో మీ పేరు ఉందా? లేదా? పోలింగ్ కేంద్రం పేరు ఏమిటి? సీరియల్ నంబరు ఏమిటి? అనే వివరాలు కనిపిస్తాయి. ఓటరు గుర్తింపు సంఖ్య తెలియకపోతే అడ్వాన్స్ సెర్చ్ విభాగంలోకి వెళ్లి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలు పొందుపర్చి వివరాలు తెలుసుకోవచ్చు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

