కారేపల్లి, ఆగస్టు 12 : పంచాయతీ పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శిలదేనని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీని మంగళవారం ఆయన సందర్శించారు. ఖమ్మం నుండి ఇల్లెందు వెళ్లే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే విధంగా పనులను తక్షణమే ప్రారంభించాలని కార్యదర్శి లోకేశ్వరిని ఆదేశించారు. నర్సరీలో ఏపుగా పెరిగి ఉన్న మొక్కల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ నరేందర్ రావు. ఏపీఓ కోటేశ్వరరావు, కంప్యూటర్ ఆపరేటర్ ప్రశాంత్ పాల్గొన్నారు.