కారేపల్లి : సింగరేణి మండల ఎంపీడీవోగా ఎంపీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ ఎంపీడీవోగా పని చేసిన పీ.శ్రీనివాస్ పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఈవోగా నియమితులయ్యారు. దాంతో, ఆయన స్థానంలో రవీంద్ర ప్రసాద్‌కు ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
సింగరేణి మండల ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మల్లెల రవీంద్ర ప్రసాద్ కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మండల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధులు, తోటి అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి రవీంద్ర ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.