ఖమ్మం సిటీ, నవంబర్ 13: ఉద్యోగోన్నతిపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో)గా నియమితులైన డాక్టర్ డీ.రామారావు గురువారం ఐడీవోసీలోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు వైద్యాధికారులు, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం, ప్రపంచ మధుమేహ దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బీ.చందూనాయక్, డాక్టర్ బిందుశ్రీలతో సమావేశమయ్యారు. మధుమేహం వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శనివారం ఐడీవోసీ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి కలెక్టర్ అనుదీప్ ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇవ్వనున్నట్లు చెప్పారు.