మామిళ్లగూడెం, జనవరి 21: ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేయాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు రంగారావు సూచించారు. నగరంలోని డీపీఆర్సీ భవనంలో శనివారం జరిగిన విద్యుత్ వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విద్యుత్ కటకట ఉండేదని అన్నారు.
రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ అనేక విద్యుత్ కర్మాగారాలు నెలకొల్పి విద్యుత్‌ను గణనీయంగా పెంచారని వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లోని విద్యుత్ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం ఎస్ఈ సురేందర్, మండలి టెక్నికల్ సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, ఫైనాన్స్ సభ్యులు బండారు కృష్ణయ్య, సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ పీ.సత్యనారాయణ, ఫైనాన్స్ సభ్యులు చరణ్‌దాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.