Puvvada Ajay | కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా: పువ్వాడ అజయ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో ఎజెండా కనిపించడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరో ఎజెండా కనిపించడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులకు ఆయన మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం కొత్తగా నిర్మించిన ఇళ్ల కంటే, వివిధ కారణాలతో కూల్చివేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని పువ్వాడ ఆందోళన వ్యక్తం చేశారు. వికాసం, అభివృద్ధి చేపట్టడం చేతకాని ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు.
పేదల ఇళ్లను కూల్చివేసి వారి జీవనోపాధిపై ప్రభావం చూపడం సరికాదని, పేదల పొట్ట కొట్టే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇళ్ల కూల్చివేత ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం నగరంలో అనేక మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, పేదలకు గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమైతే, ఇప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మిగిలిన ఘనతగా మారిందని ఆయన విమర్శించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- Congress
- khammam
- Puvvada Ajay
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

