పాల్వంచ రూరల్, మార్చి 26 : ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలిలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల ప్రజలు బుధవారం పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట నిరసన, ఆందోళన చేశారు. ఇద్దరు యువకులు గుడి ఆవరణలోని మంచినీళ్ల ట్యాంక్ ఎక్కి ఆలయ పాలక మండలిలో స్థానికులకు అవకాశం కల్పించే వరకు తాము దిగబోమని హెచ్చరించారు.
పాల్వంచ పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. పాలక మండలిని నియమిస్తూ తనకు ఆదేశాలు అందాయని, ఇరువర్గాలను పిలిచి చర్చించే క్రమంలో కొందరు ఆందోళనకు దిగినట్లు ఈఓ రజనికుమారి తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు తగిన నిర్ణయం వెల్లడిస్తామన్నారు.
Peddamma Thalli: పెద్దమ్మతల్లి పాలక మండలిలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిరసన