నూతన పూజల కోసం ప్రతిపాదనలు
డోమెంట్ కమిషనర్ ఆదేశాల ప్రకారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో నూతన పూజలు/సేవలు అమలు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు.
- వారం రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలి
- భద్రాద్రి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ
భద్రాచలం, డిసెంబర్ 8: ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల ప్రకారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో నూతన పూజలు/సేవలు అమలు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. భక్తులు వారం రోజుల్లోగా తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. ప్రతిపాదించిన పూజలు/సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిపాదిత టికెట్ రూ.500పై దర్శనం అనంతరం బేడా మండపంలో వేదాశీర్వచనం చేస్తారు. స్వామివారి తులసి మాల అలంకరణ కోసం ప్రతిపాదిత టికెట్ ధర రూ.1000. ఈ టికెట్ తీసుకున్న వారికి జాకెట్ పీస్, కండువా, రెండు చిన్న లడ్డూలు ఇస్తారు.
స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ టికెట్ ధర రూ.5 వేలు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారి పేరిట ప్రతి రోజూ నిత్య సర్వ కైంకర్య సేవలు నిర్వహిస్తారు. దీనినే ఉదయాస్తమాన సేవగా పిలుస్తారు. శ్రీరామనవమి ముత్యాల సమర్పణ టికెట్ రూ.10 వేలు. దీనిపై శ్రీరామనవమి కల్యాణ టిక్కెట్ (ఉభయం), ఉభయ దాతకు కల్పించే అన్ని సౌకర్యాలు, 108 ముత్యాల తలంబ్రాలు ఇస్తారు. నిత్య పూల అలంకరణ సేవ టికెట్ రూ.5 వేలు. దీనిపై దంపతులకు అంతరాలయంలో అర్చన చేస్తారు. తులాభారం (ప్రతి రోజూ) టికెట్ ధర రూ.100. అదనపు సమాచారం కోసం 08743-232428, 9705192935, 7660007675 నెంబర్లలో సంప్రదించాలని ఈవో కోరారు.
ముక్కోటి ఉత్సవాలపై 12న సమీక్ష
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల ఏర్పాట్ల గురించి ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు కొత్తగూడెంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు. డిసెంబర్ 23 నుంచి మత్స్యవతారంతో స్వామివారి అవతారాలు ప్రారంభమవుతాయని, జనవరి 1న గోదావరి తీరంలో హంస వాహనంపై స్వామివారికి తెప్సోత్సవం, 2న వైకుంఠద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

