‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గీత కార్మికులకు ఇచ్చిన అనేక హామీలలో ఏ ఒక్కటి నెరవేరలేదని, తక్షణం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కొండం కరుణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని...
– ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలి
– కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి కొండం కరుణాకర్ గౌడ్
ఖమ్మం రూరల్, అక్టోబర్ 09 : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గీత కార్మికులకు ఇచ్చిన అనేక హామీలలో ఏ ఒక్కటి నెరవేరలేదని, తక్షణం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కొండం కరుణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారిపల్లిలో ఎరుకల కృష్ణ అధ్యక్షతన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కరుణాకర్ గీత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కల్లుగీత కార్మిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లను బడ్జెట్ ప్రవేశపెడతామని, ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయిస్తామని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని, రెండు వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని ఇలా అనేక హామీలను ఇవ్వడం జరిగిందన్నారు.
అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న గీత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలకు పెంచాలని, భర్త చనిపోతే భార్యకు పింఛన్ సౌకర్యం కల్పించాలని, షాపుల టెండర్లలో ఈత కార్మికులకు 25 శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి లేకపోతే ప్రత్యక్ష పోరాటాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆలూరి కోటయ్య, జలగం వెంకట్రావు, బోడపట్ల కార్తీక్, నగేష్, శ్రీను, సత్యం, నాగయ్య, రామకృష్ణ, వెంకన్న, సైదులు, నవీన్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

