కారేపల్లి, జనవరి 28 : కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.విజయకుమారి ఖమ్మం జిల్లా పరీక్షల కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్ గా ఒక మహిళ నియమితులు కావడం ఇదే ప్రథమం. ఆమె నియామకంపై కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు జిల్లాలోని వివిధ అధ్యాపక సంఘాలు, ప్రిన్సిపాల్ సంఘం నాయకులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.