ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 23: పువ్వాడ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) క్రికెట్ టౌర్నమెంట్ ఈ నెల 27 నుంచి ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభం కానున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హెచ్‌సీఏ డైరెక్టర్ ఎండీ మసూద్‌తో కలిసి స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీపీఎల్ వివరాలను ఆయన వెల్లడించారు. పువ్వాడ ఉదయ్‌కుమార్ జ్ఞాపకార్థం గడిచిన రెండేళ్లుగా పీపీఎల్ పేరుతో మెగా క్రికెట్ టౌర్నమెంటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే పీపీఎల్-3 టౌర్నీని ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎనిమిది ఫ్రాంచైజీలకు సంబంధించిన టీషర్టులను ఆవిష్కరించి డ్రా తీశారు. కార్పొరేటర్ కమర్తపు మురళి, స్పర్ష భాస్కర్, నిర్వాహకులు బాలబోయిన సందీప్, ఫారూక్, వాసు, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.