ఖమ్మం రూరల్, ఏప్రిల్ 09 : ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రూరల్ మండలం స్పెషల్ ఆఫీసర్ జి.జ్యోతి, ఐసీడీఎస్ రూరల్ ప్రాజెక్ట్ సీడీపీఓ కమలాప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత కాలనీలో ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన వెలగోటి రవి – నాగమణి దంపతుల ఇంటిని సందర్శించారు. శిశు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశానుసారం మా ఇంటి మణిద్వీపం కార్యక్రమంలో భాగంగా నాగమణి, రవి దంపతులను ఘనంగా సత్కరించి, స్పీట్ బాక్స్ ను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పోషణ పక్షోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించి, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ కో ఆర్డినేటర్ షామిలీ, సెక్టార్ పర్యవేక్షకురాలు పుష్పలత, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Khammam Rural : కరుణగిరిలో పోషణ పక్షోత్సవ వేడుకలు