త్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే. ఈ నిధుల్లో రూ.4.70 కోట్లతో చిన్నకోరుకొండి – ఆర్లపాడు రోడ్డు, రూ.5.50 కోట్లతో తల్లాడ – కొడవటిమెట్ట రోడ్డు, రూ.5 కోట్లతో కలకొడిమ – బస్వాపురం రోడ్డు నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆయా మండల ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకం చేశారు.
– సత్తుపల్లి రూరల్/ కల్లూరు, తల్లాడ/ వేంసూరు, మే 26