కారేపల్లి/కామేపల్లి, అక్టోబర్ 27 : నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ పోలీలను ఆదేశించారు. కారేపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కారేపల్లి, కామేపల్లి పోలీస్స్టేషన్లను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు మర్యాద ఇస్తూ జవాబుదారీగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఫంక్షనల్ వర్టికల్స్‌ను సమర్థంగా నిర్వహించాలన్నారు.
వస్తువులు, రికార్డులు క్రమపద్ధతిలో ఉంచాలన్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలన్నారు. దాతలు ముందుకు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ బస్వరాజు, సీఐ అరీఫ్అలీఖాన్, ఎస్సైలు కిరణ్‌కుమార్, కుషకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.