కారేపల్లి, జూన్ 24 : గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంపీడీఓకు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీకు బిల్లులు రాకపోవడం వల్ల పారిశుధ్య పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అనుకున్నవారికి మాత్రమే మంజూరు చేపిస్తున్నట్లు ఆరోపించారు.
గ్రామ పంచాయతీలకు వెంటనే పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు అంతోటి అచ్చయ్య, ఒడియాల కృష్ణారెడ్డి, మల్లెంపాటి శ్రీనివాసరావు, మండల నాయకులు కాట్రాల్ రాంబాబు, సామ మోహన్ రెడ్డి, బట్టు శంకర్, మూడు కృష్ణ ప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ అజ్మీర రాజు, మాజీ సర్పంచ్ జటోత్ లూసి, ముత్యం రామకృష్ణ, అంగడాల అనంతరాములు, కంపసాటి సురేశ్, కన్నమాల రాంబాబు, మంచాల వెంకన్న, దుద్దుకూరు రాంబాబు, ఆదూరు ప్రసాద్ పాల్గొన్నారు.
Karepalli : పంచాయతీల బిల్లులు వెంటనే విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ