పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 2: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య గల పెద్దమ్మతల్లి దేవాలయంలోని శ్రీకనకదుర్గ అమ్మవారికి అర్చకులు శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకాన్ని జరిపారు. ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారి జన్మస్థలం వద్ద ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు, ఒడి బియ్యం సమర్పించారు.
అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు గావించారు. పంచహారతుల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో రజనీకుమారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మహిపతి రామలింగం, ధర్మకర్తలు పాల్గొన్నారు