పాలేరుకు జలకళొచ్చింది..
పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు రావడంతో వేసవి గండం నుంచి గట్టెక్కినైట్లెంది. 23 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న రిజర్వాయర్ ఎండల తీవ్రత దృష్ట్యా 5.5 అడుగుల అట్టడుగు స్థాయికి చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన సాగర్‌లో వదిలిన నీటిని 7వ తేదీన నిలిపివేశారు.
- 18.5 అడుగులకు చేరిన రిజర్వాయర్ నీటిమట్టం
- 2,435 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు వినియోగం
కూసుమంచి, ఏప్రిల్ 12 : పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు రావడంతో వేసవి గండం నుంచి గట్టెక్కినైట్లెంది. 23 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న రిజర్వాయర్ ఎండల తీవ్రత దృష్ట్యా 5.5 అడుగుల అట్టడుగు స్థాయికి చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన సాగర్‌లో వదిలిన నీటిని 7వ తేదీన నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగర్ డ్యాం నుంచి పాలేరు వరకు 135 కి.మీ దూరం పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల గస్తీతోపాటు రిజర్వాయర్ చుట్టూ నిరంతరం నిఘా పెట్టి నీటి చౌర్యం ఎక్కడా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో పాలేరు రిజర్వాయర్‌లో నీరు 18.50 అడుగులకు చేరింది. ఈ నీటిని ఐదు జిల్లాల్లోని 2,435 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు వినియోగించనున్నారు. అయితే నీటి వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మే చివరి నాటికి తాగునీటికి మళ్లీ ఇబ్బదులు తలెత్తే పరిస్థితి ఉంది.
శుద్ధి చేసిన నీరు సరఫరా..
పాలేరు నుంచి రా వాటర్‌ను తీసుకొని జీళ్లచెరువు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో శుద్ధి చేసి మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాదిరిపురం వద్ద డబ్ల్యూటీపీ ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు చండ్రుపట్ల వద్ద ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేస్తున్నారు. అలాగే ఖమ్మం నగరానికి తాగునీటి కోసం దానవాయిగూడెంకు నీటిని అందిస్తున్నారు.
రోజుకు 135 క్యూసెక్కుల నీరు
పాలేరు రిజర్వాయర్ నుంచి 135 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ కోసం వినియోగిస్తున్నారు. దీంతో రోజుకు 0.20 అడుగుల నీటిమట్టం తగ్గుతుంది. ఇలా వేసవి ముగిసే వరకు సుమారు 60 రోజులపాటు ఇప్పుడున్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎక్కడా నీటి ట్యాంపరింగ్ జరగకుండా చర్యలు చేపట్టడంతోపాటు కాల్వపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాలేరులో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.588 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 1.785 టీఎంసీలు ఉన్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

