Singareni | కారేపల్లి : సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్ నియమితులైనారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు. సింగరేణి ఎంపీడీవో కార్యాలయంలో ప్రస్తుతం ఇంచార్జీ ఎంపీడీవో అయిన ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ నుండి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌కు కార్యాలయం అధికారులు, సిబ్బంది స్వాగతం ఫలికారు. ఈసందర్బంగా నూతన ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కఅషి చేస్తానన్నారు. సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు.