Accident | ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు, డీసీఎం వాహనాల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతిచెందగా.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అలాగే పలువురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.