Pension | 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల విఫలపాలనపై ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. కాగా కాంగ్రెస్ హామీల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే వీడియో ఇది.
రూ.4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అంటూ వృద్దుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీశాడు. అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల సంబరాల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతున్న సమయంలో సదరు వృద్ధుడు పెన్షన్ ఎప్పుడిస్తారు అని అడిగారు.
దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. ముందుగా మనం ముందుగా చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పేందుకు ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేశామంటూ.. పెద్దాయన అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా దాటవేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన వృద్దుడు
అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 1000 రోజుల సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ఈ క్రమంలో రూ.4 వేల పెన్షన్… pic.twitter.com/0EGwNkeMgF
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2026
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్కి షాకిచ్చిన ఆడియన్స్!