ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా గెలుపును ఆపలేరు
కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలను అన్నిరంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ చేశాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ కావాలని సీఎంను కోరగానే మంజూరు చేశారు.
- రూ.3 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా
- బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి..
- ఏజెన్సీకి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చా..
- టూరిస్టులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..
- ‘నమస్తే’తో బీఆర్ఎస్ కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు
నమస్తే :కొత్తగూడెంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులు ఏమున్నాయి ?
వనమా: కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలను అన్నిరంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ చేశాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ కావాలని సీఎంను కోరగానే మంజూరు చేశారు. మంజూరయ్యాక సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మరీ చెప్పారు. అడిగింది ఇస్తున్నాం అని. వైద్య విద్యను ఏజెన్సీని తీసుకొచ్చాను.
నమస్తే :గతంలో లక్ష మందికి ఇండ్లు కట్టిచ్చామన్నారు. ఈ ఐదేళ్లలో ఎంత మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చారు ?
వనమా : నేను గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిననప్పుడు లక్ష మందికి ఇండ్లు కట్టించి ఇచ్చాను. కొత్తగూడెంలో దీర్ఘకాలికంగా ఉంటున్న వారికి క్రమబద్ధీకరణ పట్టాలు ఇచ్చాను. సింగరేణి నిర్వాసితులకు ఇంటి స్థలంతో పాటు ఇండ్ల పట్టాలు ఇచ్చాను. పాత కొత్తగూడెంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, స్థలం లేని వారికి జాగా ఇచ్చాను. వారికి గృహలక్ష్మిలో అవకాశం కలించాను.
నమస్తే: ప్రచారంలో మీకు జనాదరణ ఎలా ఉంది ?
వనమా : సీఎం కేసీఆర్ నా మీద నమ్మకంతో ఇంటికి పిలిచి మరీ భరోసా కల్పించారు. మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించారు. అదే నాకు కొండత ధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడే నా గెలుపు ఖాయమైందని భావించాను. ఎన్నికల ప్రచారంలోకి వెళ్లినప్పుడు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రతి కార్యకర్త ‘జై వనమా’ అంటున్నారు.
నమస్తే : ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి ?
వనమా: ప్రజలు నావైపే ఉన్నారు. నన్నే మళ్లీ గెలిపిస్తారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి. సర్కార్ నియోజకవర్గంలో అర్హులందరికీ పోడు రైతులు పట్టాలు ఇచ్చింది. గిరిజనేతరులకూ పోడుపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వారందరీ మద్దతు మాకుంటుందని విశ్వసిస్తున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కొత్తగూడెం ప్రచారానికి వచ్చారు. వారి సభలు, రోడ్ షోలు మాకు కలిసివస్తాయి.
నమస్తే : ఎన్నికల్లో మీకు ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు ?
వనమా: నాకు ఎన్నికల్లో పోటీలో ఎవరూ లేరు. రాలేరు. మెజారిటీతో గెలిచేటప్పుడు ప్రత్యర్థులు ఎవరుంటారు. టూరిస్టులుగా వచ్చే వారిని జనం నమ్మరు. ఇతర పార్టీలకు నియోజకవర్గంలో క్యాడర్ లేదు. జనం ఎందుకు నమ్ముతారు. అందుకే అందరూ వనమానే బెటర్ అని జై కొడుతున్నారు. నేను భారీ మెజారిటీతో గెలుస్తాను. 50 వేలకుపైగా మెజారిటీ వస్తుంది. కాంగ్రెస్, సీపీఐలో క్యాడర్ అంతా బీఆర్ఎస్లో చేరింది. దీంతో బీఆర్ఎస్ బలం పెరిగింది.
‘అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా కొత్తగూడెం నియోజకవర్గం దూసుకుపోతున్నది. నాడు డివిజన్ కేంద్రంగా ఉన్న కొత్తగూడెం నేడు జిల్లా కేంద్రమైంది. రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాను. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాను. పాల్వంచ, కొత్తగూడెం జంట పట్టణాలుగా అభివృద్ధి చేశాను. కొత్తగూడేనికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చాను.. ఈ అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి.’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ‘నమస్తే’ చిట్ చాట్‌లో పలు విషయాలు వెల్లడించారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

