ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదాన వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించిన ఆటో ఎక్స్పో షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తమకు నచ్చిన కారు, బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. తమకు నచ్చిన కారు, బైక్ మోడళ్ల వివరాలను స్టాళ్లు ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. కొందరు అక్కడికక్కడే బుక్ చేసుకున్నారు. తొలుత షోను జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా రవాణాశాఖ అధికారి మహ్మద్ గౌస్ పాషా ప్రారంభించారు.
– రఘునాథపాలెం/ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 3
కొలువుదీరిన వాహనాలు..
సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు అందర్నీ ఆకట్టుకునే విధంగా కార్లు, బైక్‌లు షోలో కొలువుదీరాయి. ఆటో షోలో వోల్వో, మహావీర్ గ్రూప్, మహావీర్ స్కోడా, సిట్రోయిన్ ప్రైడ్ మోటార్స్, ప్రైడ్ జీప్, పీపీఎస్ మోటార్స్, మెనెల్లి, వెంకటరమణ బజాజ్, జాబిశెట్టి మోటార్స్, ఎంజీ 100 రామ్ గ్రూప్, కియా ఆటోమోటివ్, రాయపూడి సుజికీ, జావా హెజ్డీ, టయోటా, వీవీసీ గ్రూప్, వజ్ర టీవీఎస్ కంపెనీల యాజమాన్యాలు తమ లేటెస్ట్ కార్లు, బైక్‌లను ప్రదర్శనకు ఉంచాయి. వాహనదారులకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, నీలోఫర్ బ్యాంకుల ప్రతినిధులు స్టాళ్ల వద్ద అందుబాటులో ఉన్నారు.
పలు కంపెనీల ప్రతినిధులు అతిథులతో తమ కంపెనీల నుంచి ఇటీవల విడుదలైన బైక్‌లు, కార్లను ఆవిష్కరింపజేశారు. కాగా.. ఆదివారం ముగింపు కార్యక్రమానికి ఎంపీ వద్ది రాజు రవిచంద్ర హాజరుకానున్నారు. ఆటో షోలో జిల్లా రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయ మోటా ర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రేన రమేశ్, ఎడిషన్ ఇన్చార్జి వెంకటప్పయ్య, బ్యూరో ఇన్చార్జ్ మాటేటి వేణు గోపాల్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్ బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, రిపోర్టర్లు శీలం శ్రీనివాసరావు, బోయిన కృష్ణ, పునాటి మనోజ్, గోపాలరావు, లక్ష్మణ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వాహన ప్రేమికులఅభిరుచులకు అనుగుణంగా షో..
వాహన ప్రేమికుల అభిరుచులకు అనుగుణంగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంస్థలు ఆటో ఎక్స్పో షో నిర్వహించడం అభినందనీయం. బైక్, కారు కొనాలనుకునే వారి అవసరాలను గుర్తించి ఒకే వేదికపైకి వివిధ కంపెనీలకు చెందిన వాహనాలు తీసుకురావడంలో ఆయా సంస్థల కృషి కనిపిస్తున్నది. ఇలాంటి వేదికలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి ఆటో షోలు మహా నగరాలకు పరిమితమయ్యేవి. ప్రస్తుతం ఖమ్మం నగరానికీ రావడం ఆనందాన్నిచ్చింది. అలాగే ఇదే వేదికగా వాహన రుణాల కోసం బ్యాంకర్లను సైతం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం.
– ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
ప్రజల ప్రయోజనార్థమే..
ప్రజల ప్రయోజనార్థమే ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ప్రాపర్టీ షో, ఆటో షోలు నిర్వహిస్తున్నాయి.. గతంలో ఇలాంటి షోలు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహా నగరాలకే పరిమితమయ్యేవి. అన్ని జిల్లాల్లో ఆటో షోలు నిర్వహించి వాహన ప్రియుల కలను సాకారం చేస్తున్నాం. ఇక ముందు కూడా మరిన్ని షోలు నిర్వహిస్తాం.
– నమస్తే తెలంగాణ అడ్వరై ్టజ్మెంట్ విభాగ జనరల్ మేనేజర్ సురేందర్‌రావు
ఇటువంటి వేదికలు అవసరం
ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇలాంటి వేదికలు వినియోగదారులకు చాలా అవసరం. అన్ని కంపెనీలకు చెందిన వాహనాలు ఒకే చోట కొలువుదీరడంతో అవసరాలకు అనుగుణంగా ఉండే వాహనాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా సొంత కారు కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. మనకు అనువైన బడ్జెట్లో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. రుణ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం బాగుంది.
-గొల్లపూడి రాంప్రసాద్, ఖమ్మం
అన్ని మోడల్స్ ఒకే చోట..
పోటీ ప్రపంచంలో అన్ని మోడల్స్‌కు చెందిన కార్లు, బైక్‌లతో ప్రదర్శన బాగుంది. దీనివల్ల వాహనాలు కొనాలనుకునే వారి సమయం వృథా కాదు. ఒకే చోట అన్ని మోడల్స్ పరిశీలించే అవకాశం ఉంది. ప్రతి కుటుంబంలో కారు నిత్యావసరంగా మారింది. సామాన్య ప్రజలు సైతం సొంత కారుపై ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ రకాల మోడల్స్ కారు, బైక్‌లు.. వాటి వివరాలు ఒకేచోట లభించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
-మహ్మద్ అయూబ్ ఖాన్, ఖమ్మం
తక్కువ వడ్డీ రేటుకే రుణాలు
మా యూనియన్ బ్యాంక్ ఏ బ్యాంకు ఇవ్వని విధంగా అతి తక్కువ వడ్డీ రేట్లతో వాహనాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నది. ఏదైనా వాహనం కొనుగోలు చేసినైట్లెతే దాని ధరలో 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో చేసిన ఆలోచన గోప్పగా ఉంది. అన్ని రకాల కంపెనీల టూ వీలర్లు, కార్లు ఉంచడంతోపాటు రుణ సదుపాయం కోసం మా బ్యాంకు స్టాల్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది.
-ఎస్.ప్రకాశ్‌బాబు, డిప్యూటీ రీజినల్ హెడ్, యూనియన్ బ్యాంక్
ఖాతాదారులకు అన్ని రకాల రుణాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులకు అన్ని రకాల రుణాలు అంబాటులో ఉన్నాయి. రైతులకు పంట రుణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలకు సైతం తక్కువ వడ్డీ రేట్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఇలాంటి ఆటో ఎక్స్పో ఏర్పాటు చేయడం, ఇందులో మా బ్యాంక్ స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పించడం మంచి పరిణామం.
-ఎస్.సురేశ్, చీఫ్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా
తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు
తక్కువ సమయంలో అతి తక్కువ వడ్డీ రేటుకు రుణ సదుపాయం కల్పించడం మా బ్యాంకు ప్రత్యేకత. అందుకు అనుగుణంగానే దశాబ్దాల తరబడి లక్షలాది మంది ఖాతాదారుల మన్ననలు పొందుతున్నాం. అయితే తొలిరోజున ఆటో ఎక్స్‌పోకు, మా స్టాల్‌కు సైతం ఆశించిన ఆదరణ రావడం చాలా హ్యాపీగా ఉంది. మా బ్యాంకు కల్పిస్తున్న అనేక సేవలను తెలుసుకునేందుకు ఖమ్మం నగరవాసులు చాలా మంది సంప్రదించారు.
-సీహెచ్.అశోక్, డిప్యూటీ మేనేజర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్
థ్యాంక్స్ టూ ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’
ఆటో ఎక్స్‌పోలో మా కంపెనీ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం కల్పించిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ పత్రిక యాజమాన్యాలకు కృతజ్ఞతలు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఈ షోలో మా స్టాల్‌కు మంచి ఆదరణ వచ్చింది. చాలా మంది యువకులు, నగరవాసులు కొనుగోలుకు ఆసక్తి చూపారు. కంపెనీకి ఉన్న ప్రాముఖ్యతతో చాలా మంది స్టాళ్లను సందర్శించారు. ఇలాంటి షో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు థ్యాంక్స్.
– సాయి ప్రకాశ్, బెల్లీ, కెవిడీ కంపెనీ ప్రతినిధి
ఇలాంటి వేదికలు మరిన్ని రావాలి
ఒకే దగ్గర అన్ని రకాల కంపెనీలకు చెందిన వాహనాలను చేర్చడం మంచి ఆలోచన. ఇలాంటి వేదికలు జిల్లా కేంద్రంలో మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కియా మోటార్స్ కంపెనీ కార్లకు తెలుగు రాష్ర్టాల్లో అపూర్వ ఆదరణ కనిపిస్తోంది. రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా తొలిరోజున నగరవాసుల నుంచి స్పందన బాగుంది. సుమారు 45-50 మంది నగరవాసులు మా స్టాల్స్‌ను సందర్శించి కారులోని ఫీచర్స్ అడిగి తెలుసుకున్నారు.
-వెంకటకృష్ణ, సేల్స్ మేనేజర్, కియా మోటార్స్
ఆటో ఎక్స్పో మంచి ఆలోచన
అన్ని రకాల కంపెనీలను ఒకే వేదిక వద్దకు చేర్చి వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించే ఆలోచన చేయడం సంతోషకరం. ఒకే దగ్గర అన్ని రకాల వాహనాలు, రుణ సదుపాయం కల్పించేందుకు సైతం బ్యాంకులు స్టాల్స్‌ను ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు మంచి అవకాశం కలిగింది. తొలిరోజు ప్రదర్శనలో నగరవాసులు మంచి ఆసక్తి కనబరిచారు. మార్కెట్లో టయోటా మోటార్స్ అంటే తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు. వారికి కూడా చేరువ చేయాలన్నదే లక్ష్యం.
-వై.రవి, సేల్స్ ఆఫీసర్, టయోటా మోటార్స్
యువత ఆసక్తి కనబరిచారు
నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్‌పోలో మా స్టాల్‌ను అనేక మంది యువకులు సందర్శించడం సంతోషంగా ఉంది. మార్కెట్లో ఎంతో క్రేజ్ ఉన్నందున గ్రామాల నుంచి సైతం యువకులు భారీగా వచ్చి మా వాహనాలను టెస్టు రైడ్ చేశారు. కంపెనీకి మార్కెట్లో ఉన్న ఆదరణకు తోడు ఆటో ఎక్స్‌పోలో మాకు అవకాశం రావడం సంతోషం.
-బీ.నిఖిల్, బ్రాండ్ చాంప్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ
నమ్మకానికి చిరునామా ‘స్కోడా’
కారు తయారీలో స్కోడా కంపెనీకి ప్రత్యేకత ఉంది. స్కోడా కంపెనీ నుంచి వచ్చిన అనేక మోడల్ వాహనాలకు మార్కెట్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఆటో ఎక్స్‌పోలో మా కంపెనీ స్టాల్‌ను ఏర్పాటు చేశాం. తొలిరోజు జిల్లావాసుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 50 మంది కొత్త వినియోగదారులు మమ్మల్ని ఆశ్రయించారు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులు, వినియోగదారులకు కృతజ్ఞతలు.
-ప్రణీత్‌కుమార్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, స్కోడా కారు కంపెనీ