ఎర్రుపాలెం: ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు (Nama Nageshwar Rao) జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నామా నాగేశ్వరరావు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, నాయకులు శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సంక్రాంతి కృష్ణారావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, శీలం నారాయణరెడ్డి, బొర్రా నరసింహారావు, కాళేశ్వరరావు, బ్రహ్మానందరెడ్డి, నాగేశ్వరావు, వెంకటేశ్వరరావు, రాంబాబు రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, గోపిరెడ్డి, శంకరరావు, నాగేశ్వరావు ఏసోబు, ప్రకాశ్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.