తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన (ఎంఏకే టవర్స్) నిర్మాణానికి గురువారం భూమి పూజా మహోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రసంగించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్, వీరమల్ల ప్రకాశ్ రావు, కొండ దేవయ్య పటేల్, పుటం పురుషోత్తం పటేల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఆకుల లలిత, కొత్త లక్ష్మణ్ పటేల్ పాల్గొన్నారు.