ఖమ్మం, ఆగస్టు 10 : జనాభాలో సగ భాగం కంటే ఎకువగా ఉన్న బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద శనివారం బీసీ సంఘాల నాయకులు చేపట్టిన స త్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని మద్దతు ప లికారు.
బీసీల న్యాయమైన హకుల సాధన కోసం సత్యాగ్రహ దీక్ష చేస్తున్న యువ కిశోరాలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల న్యాయమైన వాటా, కులగణన కోసం చేస్తున్న ఉద్యమాలకు సం పూర్ణ మద్దతు తెలుపుతున్నానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయి ఉండి కూడా కేం ద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని, రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీసీలకు సముచిత గౌరవం లేదన్నారు.
మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, విశ్వ బ్రాహ్మణులు, రజకులు మం త్రివర్గంలో ఒకరూ కూడా లేరన్నారు. రిజర్వేషన్ల కల్పనకు మరింత సంఘటితమై పో రాడి న్యాయమైన హకుల్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రముఖులతో కలిసి సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.