ఖమ్మం, జనవరి 25 : అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించిన మంత్రి తన్నీరు హరీశ్‌రావును బీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో సభా ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలించారని కొనియాడారు. పండుగ రోజుల్లో మంత్రి ఖమ్మంలోనే ఉండి ఏర్పాట్లు చేశారని అభినందించారు. దీంతో ఊహించిన దానికంటే అధికంగా ప్రజలు సభకు హాజరయ్యారన్నారు.