ఖమ్మం: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అండగా నిలిచారు. నామ ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసీ జారీ అయింది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రూ.3లక్షలు మంజూరు చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఉట్లపల్లి గ్రామానికిన చెందిన పిల్ల అన్నవరం అనే వ్యక్తి గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట నియెజకవర్గంలోని మండల నాయకులు ఎంపీ నామ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన నామ ప్రత్యేక చొరవ తీసుకుని గుండె ఆపరేషన్‌కు అవసరమయ్యే నిధులను మంజూరు చేయించారు.
దీనికి సంబంధించిన ఎల్ఏసీ కాఫీని నామ బాధితుడి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా బాధితుడితోపా కుటుంబ సభ్యులు నామకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మల్కలపల్లి ఎంపీపీ మట్టా నాగమణి, టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ, చిత్తారు సింహాద్రి, కనకమేడ సత్యనారాయణ, లగడపాలి రమేష్, పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, భార్గవ్, హారీష్ తదితరులు పాల్గొన్నారు.