Monkey | రామవరం మార్చి 10 : కులాలు, మతాలు, జాతులు అంటూ ఈ ప్రపంచంలో మానవుల మధ్య నిత్యం వైరమే. ఈ వైరం మాకేలా అంటూ నీరు, నిప్పు వలే ఉండే జంతువులు పేగు బంధం మాదిరి కలిసిపోయాయి. ఈ దృశ్యం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది.
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మసీదు ప్రాంగణంలో ఓ శునకం పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ శునకం పిల్లలను చూసిన వానరం అందులోని ఓ పిల్లను ఎత్తుకుని లాలిస్తుంది. అంతేకాకుండా జాతి వైరం మరిచి తమది పేగు బంధం కాకపోయినా పెంపకం బంధం అన్నట్లుగా తాను ఎక్కడికి వెళ్లినా తన బిడ్డ వలె వెంటే తీసుకువెళ్తుంది. ఈ దృశ్యం నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కింది.