ఖమ్మం అర్బన్, నవంబర్ 20: ప్రతి విద్యార్థీ చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) ఎస్.శ్రీనివాసచారి ఆకాంక్షించారు. అందుకోసం ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అవిరళ కృషి చేయాలని సూచించారు. క్యాంపెయిన్ 5.0పై ఎంఈవోలు, హెచ్ఎంలతో ఖమ్మం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఖమ్మం డీఈవో చైతన్య జైనీతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఎస్, ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ ఎఫ్ఎల్ఎస్ (2025-26), బడి బయట పిల్లల సర్వే, ఈసీఆర్‌పై పలు సూచనలు చేశారు. సెక్టోరల్ అధికారులు రామకృష్ణ, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, రూబీ పంకజం, డీసీఈబీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, శ్రీనివాసరావు, ఏపీవో శ్రీనివాసరావు, డీఎస్వో రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, నవంబర్ 20: కారేపల్లి మోడల్ సూల్, కామేపల్లి మండలం కొమ్మినేపల్లి పాఠశాలలను మోడల్ సూల్స్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) ఎస్.శ్రీనివాసచారి గురువారం సందర్శించారు. పాఠశాలల్లో లైబ్రరీ, టాయిలెట్స్, స్పోర్ట్స్, కిచెన్ రూమ్‌లను తనిఖీ చేశారు. ఎంఈవో దుగ్గిరాల జయరాజు, సీఎంవో ప్రవీణ్‌కుమార్, మోడల్ సూల్ ప్రిన్సిపాల్ ఎలియట్ ప్రేమ్‌కుమార్, ఎంఐఎస్ మోతీలాల్, ఎంసీవో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.