నేలకొండపల్లి, జనవరి 12: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని, వారు గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. చెరువుమాధారంలో టెక్‌వేవ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను గురువారం ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అదే విధంగా గ్రామంలో కందాళ ప్రీమియర్ లీగ్ సీజన్ పేరుతో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను కందాళ ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల మృతిచెందిన నాగవెల్లి వెంకటరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం చెరువుమాధారం గ్రామంలోని జడీఎస్ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, సర్పంచ్ ఈవూరి సుజాత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి వెన్నబోయిన శ్రీను, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, రైతు కన్వీనర్ శాకమూరి సతీశ్, సొసైటీ చైర్మన్ పగిడిపత్తి శ్రీను, నందిగామ కవితారాణి, అనగాని నర్సింహారావు, పతానపు నాగయ్య, వజ్జా శ్రీనివాసరావు, సూరేపల్లి వేణు, సువర్ణబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కూసుమంచి, జనవరి 12: స్వామి వివేకానంద చూపిన మార్గం యువతకు మేలు చేస్తున్నదని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. గురువారం జాతీయ యువజనోత్సవ దినోత్సవం సందర్భంగా మండలంలోని పాలేరులో యువతా మేలుకో ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అద్దకి ఉపేంద్రాచారి, దాసరి బాలకృష్ణ, యువజన సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
కూసుమంచి రూరల్, జనవరి 12: స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శమని జుజ్జుల్‌రావుపేట ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం జీ కృష్ణయ్య అన్నారు. వివేకానందుని జయంతిని పురస్కరించుకుని మండలంలోని పలు విద్యాలయాల్లో గురువారం యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాల వేసి, నివాళి అర్పించారు. భారత్ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటిన వివేకానందుని జీవితం భావి తరాలకు ఆదర్శమన్నారు.
తిరుమలాయపాలెం, జనవరి 12: మండలంలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత వివేకానందస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.