కూసుమంచి, డిసెంబర్ 30: కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జీళ్లచెరువులోని జిన్నింగ్ మిల్లులో శుక్రవారం జరిగిన పాలేరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో 2023 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పాత్రికేయులు తమ వంతు బాధ్యతలు నెరవేర్చాలన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాస్, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, పార్టీ మండల అధ్యక్షులు బెల్లం వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, నాయకులు మల్లీడి వెంకటేశ్వర్లు, నంబూరి సత్యనారాయణ, చాట్ల పరశురాం, వజ్జా శ్రీనివాసరావు, ఆసిఫ్ పాషా, కొక్కిరేణి సీతారాములు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ
మధిర టౌన్, డిసెంబర్ 30: మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల, పట్టణ కమిటీల ప్రజాప్రతినిధులు, నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామస్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
చింతకానిలో..
చింతకాని, డిసెంబర్ 30: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన మధిర నియోజకవర్గ క్యాలండర్‌ను మండల పరిషత్ కార్యాలయంలో నాయకులు శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సబ్బండ వర్గాలకు మంచి రోజులు వచ్చాయన్నారు.