kha
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో వినాయక చవితి పురస్కరించుకొని వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద గురువారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దేవుడి పట్ల విశ్వాసం కలిగి, తోటివారికి తమవంతు సహకారం అందించాలని కోరారు. ఈసందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమార్క్ఫైడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.