సీఎం కేసీఆర్‌తోనే పోడు రైతుల జీవితాల్లో వెలుగులు
ముఖ్యమంత్రి కేసీఆరే తమ జీవితాల్లో వెలుగులు నింపారని పోడుదారులు పేర్కొన్నారు. ఆయన నిర్ణయం వల్లనే పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు.
- జీవో 140 విడుదల పట్ల పోడుదారుల్లో హర్షాతిరేకాలు
- గిరిజన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు
సారపాక/ ములకలపల్లి, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆరే తమ జీవితాల్లో వెలుగులు నింపారని పోడుదారులు పేర్కొన్నారు. ఆయన నిర్ణయం వల్లనే పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. పోడు భూములపై హక్కుల కల్పన, పత్రాల పంపిణీ కోసం జీవో 140ని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
ఈ మేరకు ఆయా గిరిజన గ్రామాలు, ఆదివాసీ గూడేల్లో టీఆర్ఎస్ నాయకులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో కలిసి పోడు రైతులందరూ బుధవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో సర్పంచ్ కొర్సా లక్ష్మి, నాయకుడు రమేశ్, ములకలపల్లి మండలంలో మోరంపూడి అప్పారావు, శెనగపాటి అంజి, మట్ల నాగమణి, నాగళ్ల వెంకటేశ్వరరావు, బండి కొమరయ్య, కరకగూడెం మడలం తాటిగూడెంలో ఉప సర్పంచ్ జాడి నాగరాజు, పోడు రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

