విద్యుత్ షాక్‌తో పాడి బర్రె మృతి
సింగరేణి మండలం తొడితలగూడెం గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో రైతు జక్కుల సర్వేశ్వరరావుకు చెందిన పాడి బర్రె మృతి చెందింది. రైతు తన ఇంటి వద్ద ఉన్న షెడ్డులో బర్రెను కట్టి వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో షెడ్డులోని విద్యుత్ మీటర్‌కు...
కారేపల్లి, అక్టోబర్ 30 : సింగరేణి మండలం తొడితలగూడెం గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో రైతు జక్కుల సర్వేశ్వరరావుకు చెందిన పాడి బర్రె మృతి చెందింది. రైతు తన ఇంటి వద్ద ఉన్న షెడ్డులో బర్రెను కట్టి వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో షెడ్డులోని విద్యుత్ మీటర్‌కు స్తంభం నుండి వచ్చిన సర్వీస్ వైర్‌కు సపోర్టుగా ఉంచిన కర్రకు చెదలు పట్టి ఉండటంతో బర్రె తగలగానే కర్ర కిందపడింది. దీంతో విద్యుత్ వైరు బర్రె కాళ్లు, మెడకు చుట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, పశు వైద్యాధికారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్, బానోత్ కుమార్, పెరుగు రామకృష్ణ రైతును పరామర్శించి ఓదార్చారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

