మధిర, నవంబర్ 11 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం మధిర పురపాలక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబుల్ కలాం చిత్ర పటానికి మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శివ కృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.