మధిర, మే 01 : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రొంపిమళ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శీలం మల్లికార్జున్రెడ్డి (33) తన ఇంట్లో విద్యుత్ బోర్డుకు కూలర్ కు సంబంధించిన ప్లగ్ పెడుతున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై చనిపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న మధిర రూరల్ టౌన్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు చేశారు.