మధిర, మార్చి 24 : ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం చింతకాని మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పెంటల పుల్లయ్య మాట్లాడుతూ.. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాని మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మంకెన రమేశ్, వేముల నర్సయ్య, మాజీ ఎంపీపీ పోనుగొటి రత్నాకర్, జావిద్, బొప్పరం పాల్గొన్నారు.