Palwancha Peddamma Gudi | భద్రాద్రి-కొత్తగూడెం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): పాల్వంచలోని పెద్దమ్మగుడిలో శివాలయ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్స వాలు సోమవారం ఘనంగా జరిగాయి. భద్రాద్రి-కొత్తగూడం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం గ్రామాల మధ్యగల పెద్దమ్మతల్లి దేవాలయంలో మూడు రోజులుగా ఆలయ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
కొత్తగా నిర్మించిన శివాలయంలో శివుని విగ్రహ ప్రతిష్ట చేశారు. సోమవారం మహిళలు కుంకుమార్చన, చండీ హోమంలో పాల్గొన్నారు. నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు పాల్వంచ నుంచి కొత్తగూడెం వరకు వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. విగ్రహాలు,మకర తోరణాలను ఊరేగించి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.