మధిర, జులై 09 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ బుధవారం దేశ వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మధిర డిపో ఆర్టీసీ కార్మికులు తమ విధులను బహిష్కరించి డిపో ఎదుట చేపట్టిన సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తిమ్మినేని రామారావు, సీపీఐ మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు ప్రయోజనమయ్యే చట్టాలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మధిర డిపో జేఏసీ నాయకులు అరుణకుమారి, పద్మావతి, రామచంద్రారావు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నాగుల్ మీరా, కాలేశా, లెనిన్, శ్రీనివాసరావు, కొండయ్య, హనుమంతరావు, ప్రసాద్, సత్యనారాయణ, హరికృష్ణ, దేవదానం, నాగరాజు, కృష్ణ, వెంకన్న, నాగమల్లేశ్వరి, సరస్వతి, రాధిక, రాణి, శివమ్మ, సుజాత, నసీమా, అనిత పాల్గొన్నారు.