మధిర, మార్చి 14: ఆరు గ్యారెంటీలపై ప్రశ్నించినందుకే ఉద్దేశపూర్వకంగా జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని, ఇది అత్యంత దారుణమైన విషయమని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మధిర పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ద్వారా అమలు చేయని ఆరు హామీలను అమలు చేసినట్లుగా చెప్పించిందని, దీనిపై ప్రశ్నించినందుకే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, కటికల సత్యనారాయణరెడ్డి, యన్నంశెట్టి వెంకట అప్పారావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, షేక్ ఖాదర్, వేమిరెడ్డి పెదనాగిరెడ్డి, పల్లపాటి కోటేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, పరిస శ్రీనివాసరావు, చీదిరాల రాంబాబు, కొత్తపల్లి నరసింహారావు, షేక సైదా, అబ్దుల్ ఖురేషి, కోట కోటేశ్వరరావు, వీరంశెట్టి సీతారామయ్య, కాకుమాను కృష్ణమూర్తి, కప్పగంతుల పట్టాభిరామకృష్ణ, బత్తుల శ్రీనివాసరావు, ఆవుల గోపి, సంపసాల కొండ, ఓరుగంటి విజయ్, షేక్ జాన్‌సైదా, షేక్ మౌలాలి పాల్గొన్నారు.