ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 29: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు నిర్వహిస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఈవోలు యాదయ్య, సోమశేఖరశర్మ అన్నారు. మంగళవారం నగరంలోని డైట్ కళాశాలలో రెండు జిల్లాలకు చెందిన ఎంఈవోలు, నోడల్ ఆఫీసర్లు, సెక్టోరల్ ఆఫీసర్లు, డీఆర్పీల శిక్షణలో వారు మాట్లాడారు.
కచ్చితమైన పర్యవేక్షణ చేసి విద్యార్థుల ప్రగతి లోపాలు ఎక్కడున్నాయో గుర్తించి, సంబంధిత ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు చేసి మంచి వాతావరణంలో మార్గదర్శకం అం దించాలన్నారు. విద్యార్థులందరూ సంపూ ర్ణ అభ్యాసనం సాధించగలిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్, డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ, ఏఎంవో రవికుమార్, సెక్టోరల్స్ రాజశేఖర్, రామకృష్ణ, నాగరాజశేఖర్, ఎస్ఆర్పీలు పాల్గొన్నారు.