ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీనీ పరిశుభ్రత మున్సిపాలిటీగా తయారు చేసే విధంగా ప్రజాపాలన ప్రగతి-ప్రణాళిక సిద్ధం చేశామని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బందితో పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీతో కలిసి మునిసిపల్ సిబ్బంది కౌన్సిలర్లతో పారిశుద్ధ్య ప్రణాళికకు సంబంధించి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేటి నుండి మున్సిపాలిటీ లో ప్రారంభం అయ్యిందన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి పది రోజులకు ఒక శాఖ తరపున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. 99 రోజుల ప్రణాళికకు సంపూర్ణ సహకారం అందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు శ్రీధర్ రెడ్డి, మణి, ఉమా, కిరణ్, శ్రీనివాస్, మధు ,పాల్గొన్నారు