కారేపల్లి, జూన్ 1 : ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన చరిత్ర అధ్యాపకుడు తమ్మిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రస్థాయి హిస్టరీ టెక్స్ట్ బుక్ కమిటీలో సెలెక్ట్ అయ్యారు. కమిటీలో 9 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా తమ్మిశెట్టి శ్రీనివాస్ ఒక్కరే కమిటీలో ఏకైక అధ్యాపకులు కావడం విశేషం.
రాష్ట్రస్థాయి కమిటీలో కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ హిస్టరీ లెక్చరర్ ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ్మిశెట్టి శ్రీనివాస్ సింగరేణి(కారేపల్లి)మండలం గ్రామ నివాసి కూడా… నిరుపేద కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.